
న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీస్‌లు అందించే ఉబర్ ఢిల్లీలో బస్సులను ఆపరేట్ చేయడానికి అనుమతులు పొందింది. దేశ రాజధానిలో బస్ సర్వీస్‌లను నడపడానికి ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందామని కంపెనీ ప్రకటించింది. బస్సులను నడపడానికి లైసెన్స్‌లు ఇస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ. ప్రీమియం బస్ స్కీమ్ కింద లైసెన్స్ పొందిన మొదటి సంస్థగా ఉబర్ నిలిచింది.
‘పైలెట్ ప్రోగ్రామ్‌లో బస్సులకు మంచి డిమాండ్ చూశాం. ఢిల్లీలో ఉబర్ బస్సులను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’ అని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్‌పాండే అన్నారు. ఉబర్ యాప్‌లో ‘ఉబర్ షటిల్’ ను ఎంచుకొని తమకు నచ్చిన రూట్లలో నచ్చిన సీట్లను కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతాల్లో పైలెట్ ప్రోగ్రామ్‌ను ఉబర్ నిర్వహించింది.
ఉబర్ యాప్ ద్వారా వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చని, బస్సుల లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చని, ఎంత టైమ్‌లోపు వస్తుందో తెలుసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా, ప్రతి ఉబర్ షటిల్ వెహికల్‌లో 19–50 మంది ప్యాసింజర్లు పడతారు.