9 నుంచి ఫోర్టిఫైడ్‌‌‌‌ రారైస్‌‌‌‌ మాత్రమే తీసుకుంటం

9 నుంచి ఫోర్టిఫైడ్‌‌‌‌ రారైస్‌‌‌‌ మాత్రమే తీసుకుంటం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌)లో ఫోర్టిఫైడ్‌‌‌‌ రారైస్‌‌‌‌ మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌‌‌‌సీఐ స్పష్టం చేసింది. బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ను పూర్తి స్థాయిలో తీసుకోబోమని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వానాకాలం, యాసంగిలో సేకరించిన వడ్లకు సంబంధించి సీఎంఆర్‌‌‌‌ను 7 వరకు మాత్రమే రా రైస్‌‌‌‌ తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఇకపై తీసుకునే రైస్‌‌‌‌లో ఫోర్టిఫైడ్‌‌‌‌ రారైస్‌‌‌‌ మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్‌‌‌‌సీఐ జీఎం ఆదేశాల జారీ చేశారు.

ఈ నెల 9 నుంచి పూర్తిగా ఫోర్టిఫైడ్‌‌‌‌ రా రైస్‌‌‌‌ మాత్రమే తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వానాకాలం కొనుగోళ్లకు సంబంధించి కూడా ఫోర్టిఫైడ్‌‌‌‌ రా రైస్‌‌‌‌ మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. బలవర్థకమైన ఫోర్టిఫైడ్ రారైస్‌‌‌‌కు మాత్రమే డిమాండ్‌‌‌‌ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒక క్వింటాల్‌‌‌‌ కెర్న ల్స్‌‌‌‌కి, వంద క్వింటాళ్ల రారైస్‌‌‌‌ కలిపి ఫోర్టిఫైడ్‌‌‌‌ రారైస్‌‌‌‌ తయారు చేస్తారు.