న్యూఢిల్లీ: ఇండియా 2025లో 47 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌డీఐల)ను ఆకర్షించగలిగింది. 2024తో పోలిస్తే ఇది 73 శాతం ఎక్కువ. యూనైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) రిపోర్ట్ ప్రకారం, సేవలు (ఫైనాన్స్, ఐటీ, ఆర్ అండ్ డీ), తయారీ రంగాల్లోకి భారీ పెట్టుబడులు వచ్చాయి.
గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో భారత్ స్థానాన్ని బలపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు సాయపడ్డాయి. చైనాకు ఎఫ్‌డీఐలు 8శాతం తగ్గి 107.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ దేశానికి వరుసగా మూడో ఏడాది కూడా ఎఫ్‌డీఐల ఫ్లో తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోకి వెళ్లిన ఎఫ్‌డీఐల విలువ 2025లో 1.6 ట్రిలియన్ డాలర్లకి చేరింది. 14శాతం గ్రోత్ నమోదైంది.
