ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకెప్పుడు?..బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా  

ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకెప్పుడు?..బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా  

ముషీరాబాద్, వెలుగు : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ప్రశ్నించింది. ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ధర్నాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్, వి నారగోని హాజరయ్యారు. విశారదన్​మహరాజ్​మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఈ ప్రభావం కోటి కుటుంబాలపై పడిందన్నారు. బకాయిలను విడుదల చేయాలని , ప్రైవేట్ కాలేజీలకు చెల్లించే ఫీజుతో నిమిత్తం లేకుండా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని కోరారు.