ఫిలింనగర్‌‌‌‌ లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం

ఫిలింనగర్‌‌‌‌ లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం

జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ఫిలింనగర్‌‌‌‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఫెరారీ స్పోర్ట్స్  కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి సైట్- 2, రోడ్  నంబర్ 5లో ఉన్న ఓ ఇంటి గేటును ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారులోని ఎయిర్‌‌‌‌బ్యాగ్‌‌‌‌లు తెరుచుకోవడంతో డ్రైవర్  సతీశ్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు బయటపడ్డారు. 

తెల్లవారుజామున భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం ధాటికి ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమవగా, ఫెరారీ కారు ముందు భాగం దెబ్బతింది. ఫిలింనగర్  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డ్రైవర్  సతీశ్​కు బ్రీత్  అనలైజర్  టెస్ట్​ నిర్వహించగా, మద్యం తాగలేదని తేలింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.