సర్కార్ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు.. ట్రీట్‌‌మెంట్‌‌, మెడిసిన్లు ఫ్రీ

సర్కార్ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు.. ట్రీట్‌‌మెంట్‌‌, మెడిసిన్లు ఫ్రీ
  • హైదరాబాద్‌‌, వరంగల్‌‌లో మూడు కేంద్రాల ఏర్పాటు
  • నిధుల మంజూరుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ ఏడాదే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్‌‌, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో ఇన్‌‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్‌‌లోని గాంధీ, పేట్లబుర్జు దవాఖాన్లు, వరంగల్‌‌లోని సీకేఎం హాస్పిటల్‌‌లో ఫర్టిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రానికి ప్రపోజల్స్ పంపింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ మూడు సెంటర్లకు నిధులు మంజూరు చేసేందుకు సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాంధీ, సీకేఎంలో మదర్ అండ్ చైల్డ్‌‌ హెల్త్ కేర్ యూనిట్లను సైతం కేంద్రం మంజూరు చేసింది. ఐయూఐ, ఐవీఎఫ్ వంటి అన్ని రకాల ప్రొసీజర్లు చేసేందుకు అనుగుణంగా ఆపరేషన్‌‌ థియేటర్లు, ఎక్విప్‌‌మెంట్‌‌తో ఫర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్కో సెంటర్‌‌‌‌ ఏర్పాటుకు రూ.4 నుంచి 5 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెడిసిన్స్, ఎక్విప్‌‌మెంట్ ఇతర అవసరాలకు మరో రూ.2 కోట్ల వరకూ వెచ్చించనున్నారు. కరోనాకు ముందు గాంధీలో కొంత కాలం వారానికి ఓ రోజు ఇన్‌‌ఫర్టిలిటీ ఓపీ నిర్వహించారు. ఇక్కడ 640 మందికి ఐయూఐ (ఇంట్రాయుటెరిన్ ఇన్ సెమినేషన్) ట్రీట్ మెంట్ చేశారు. సర్కార్ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తే వేల మందికి ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ అందనుంది.

ప్రైవేట్‌‌లో అడ్డగోలు దోపిడీ

రాష్ర్టంలో ప్రతి వందలో కనీసం15 జంటలు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నాయి. మారిన లైఫ్ స్టైల్‌‌తో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి. ఇదే అదునుగా ప్రైవేట్‌‌ ఇన్‌‌ఫర్టిలిటీ క్లినిక్‌‌లు వందల్లో పుట్టుకొచ్చాయి. బాధితుల వీక్‌‌నెస్‌‌ను క్యాష్‌‌ చేసుకుంటూ అడ్డగోలుగా మందులు మింగిస్తున్నారన్న ఆరోపణలున్నయి. ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

మూడేండ్లుగా పెండింగ్

మన దగ్గర సర్కార్ ఫర్టిలిటీ సెంటర్ల కోసం మూడేండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండేండ్ల కిందట నిధులు కేటాయిస్తూ రాష్ర్ట సర్కార్ జీవో కూడా ఇచ్చింది. కానీ, ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆ తర్వాత కరోనా రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఎన్‌‌హెచ్‌‌ఎం కింద బడ్జెట్‌‌ కేటాయించేందుకు సెంట్రల్ సర్కార్ ఓకె చెప్పడంతో, మళ్లీ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది చివరికల్లా సెంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

గాంధీలో త్వరలోనే రీస్టార్ట్‌‌‌‌ చేస్తాం  

రాష్ట్రంలో ఇన్‌‌‌‌ఫర్టిలిటీ రేట్ పెరిగింది. సంతానం లేక వేల మంది మెంటల్‌‌‌‌గా డిస్ట్రబ్‌‌‌‌ అవుతున్నరు. ప్రైవేట్‌‌‌‌లో తప్ప, గవర్నమెంట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఫర్టిలిటీ సెంటర్లు లేవు. అందుకే ప్రైవేట్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కాస్ట్‌‌లీగా ఉంది. జీరో కాస్ట్ ఐవీఎఫ్‌‌‌‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కేరళకు వెళ్లి స్టడీ చేశాం. గాంధీలో 640 మందికి ఐయూఐ చేసి చాలా వరకూ సక్సెస్ అయ్యాం. కరోనాతో వన్ ఇయర్‌‌‌‌గా చేయడంలేదు. త్వరలోనే రీస్టార్ట్ చేస్తాం.

– ప్రొఫెసర్ జానకి వెల్లంకి, గైనకాలజిస్ట్‌‌‌‌, గాంధీ హాస్పిటల్‌‌‌‌

For More News..

బంజారా బిర్యానీకి ఫస్ట్ ప్రైజ్

స్కాలర్​షిప్​ అప్లికేషన్లకు మార్చి 31 వరకు చాన్స్

జాగాల్లేవ్.. పైసల్లేవ్.. మొక్కలెట్ల నాటాలె?