
సాకర్ సమరం మొదలైంది. కప్ గెలవాలనే కసితో అర్జెంటీనా – ఫ్రాన్స్ జట్లు మైదానంలోకి అడుగుపెట్టాయి. మ్యాచ్ ఆరంభం నుంచే గోల్ సాధించేందుకు ఇరు జట్ల క్రీడాకారులు ప్రయత్నించారు. అర్జెంటీనా క్రీడాకారులు ఎక్కువగా గోల్ పోస్టుపై దాడి చేశారు. కానీ ఫ్రాన్స్ గోల్ కీపర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో గోల్స్ తప్పాయి. తామేమీ తక్కువ తినలేదని ఫ్రాన్స్ క్రీడాకారులు ప్రయత్నించారు. చివరకు 22వ నిమిషంలో పెనాల్టీ షూట్ అవుట్ లో ‘మెస్సీ’ తొలి గోల్ సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అనంతరం అర్జెంటీనా ఆటగాడు డి మేరియా మరో గోల్ చేశారు. దీంతో ఫ్రాన్స్ పై అర్జెంటీనా 2 – 0 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్కోర్ సమం
- అర్జెంటీనా 2 – 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ఒత్తిడిలోకి జారుకున్న ఫ్రాన్స్ ను స్టార్ ఆటగాడు ఎంబాపే 2 వరుస గోల్స్ తో ఆదుకున్నాడు. మ్యాచ్ 79వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్ ను ఎంబాపే గోల్ గా మలిచాడు. అనంతరం మరో రెండు నిమిషాల్లోపే ఎంబాపే రెండో గోల్ కూడా చేసి అదుర్స్ అనిపించాడు. దీంతో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల స్కోర్ 2 –2 పాయింట్లతో సమమైంది. మ్యాచ్ సెకండ్ హాఫ్ ముగిసే సమయానికి రెండు టీమ్ లు సమ స్కోర్లతో ఉన్నాయి.
- తన టీమ్ తో కలిసి వరల్డ్ కప్ అందుకోవాలన్న లియోనల్ మెస్సీ కల నెరవేరుతుందా.. లేక ఫ్రాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తుందా.. అని ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న మెస్సీ.. ఈ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే.. తన దేశం తరపున ఆడే చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఫుట్ బాల్ అభిమానులంతా.. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ ఆట తీరును చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.