V6 News

బుద్ధిగా ఇంట్లో కూర్చొని చూడటమే బెటర్: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ టిక్కెట్లు రూ. 21 కోట్లు

బుద్ధిగా ఇంట్లో కూర్చొని చూడటమే బెటర్: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ టిక్కెట్లు రూ. 21 కోట్లు

వాషింగ్టన్‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నాలుగు సీట్ల టిక్కెట్లకు  ఫిఫా రీ సేల్‌‌‌‌ సైట్‌‌‌‌లో ఏకంగా రూ.21 కోట్ల (2.3 మిలియన్‌‌‌‌ డాలర్లు) ధర పెట్టింది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌‌‌‌లైఫ్‌‌‌‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్​మ్యాచ్‌‌‌‌కు ఈ ప్రత్యేక సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ వెనక భాగంలో ఉన్న లోయర్‌‌‌‌ డెక్‌‌‌‌లోని బ్లాక్‌‌‌‌ 124, లైన్‌‌‌‌ 45లో ఇవి ఉన్నాయి. 33 నుంచి 36 సీట్‌‌‌‌ నెంబర్లుగా ప్రకటించారు. 

వీటి చుట్టు పక్కల ఉండే సీట్లకు కూడా ఫిఫా భారీ రేట్లను పెట్టింది. బ్లాక్‌‌‌‌ 146లో ఒక్క సీటు ధర దాదాపు కోటి 94 లక్షలు. గ్యాలరీ చివరి వరుసలో ఉన్న సీటు ధర ఒక కోటి 30 లక్షలు. ఈ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ 211 సభ్య దేశాల్లో  ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ అభివృద్ధికి పెట్టుబడిగా పెడతామని ఫిఫా వెల్లడించింది. ఈ టిక్కెట్ల అమ్మకపు ధరలను తాము నేరుగా నియంత్రించలేమని తెలిపింది.