12 ఏళ్ల తర్వాత ఇండియాకు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ

12 ఏళ్ల తర్వాత  ఇండియాకు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ

న్యూఢిల్లీ: దాదాపు 12 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌‌‌‌కు సంబంధించిన అసలైన ట్రోఫీని ఇండియాకు తీసుకొచ్చారు. ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టూర్‌‌‌‌లో భాగంగా దీన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఫిఫా చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో వచ్చిన ఈ ట్రోఫీని తాజ్‌‌‌‌ మహల్‌‌‌‌ హోటల్‌‌‌‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌‌‌‌ మాండవీయా, ఫిఫా లెజెండ్‌‌‌‌ గిల్బెర్టో డి సిల్వా, స్పోర్ట్స్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ బొరియా మజుందార్‌‌‌‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ ట్రోఫీ 6.175 కేజీల బరువు ఉంటుంది. ప్రపంచ గ్లోబ్‌‌‌‌ను ఎత్తిపట్టుకున్న ఇద్దరు మానవాకారాల కళాత్మక రూపకల్పనగా ఈ ట్రోఫీని తీర్చిదిద్దారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈ డిజైన్‌‌‌‌ను 1974లో అధికారికంగా పరిచయం చేశారు.