ఫైట్ చేస్తున్న నటసింహం

ఫైట్ చేస్తున్న నటసింహం

నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ లెటెస్ట్ ఫిల్మ్ ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విలన్ లపై బాలయ్య విరుచుకపడే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. కీలక సమయంలో ఈ ఫైటింగ్ రానుంది. అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. 

దీపావళి సందర్భంగా...అక్టోబర్ 21న NBK 107 టైటిల్ ను ప్రకటించారు. కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద టైటిల్ లోగోను విడుదల చేశారు. ‘వీర సింహా రెడ్డి’ టైటిల్ ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు.  దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ లు భారీ ఎత్తున సినిమాను రూపొందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.