ప్రభుత్వాన్ని మార్చేందుకు పోరాడాలి... యువత భవిష్యత్తును బీజేపీ దొంగిలిస్తోంది: ఉద్ధవ్ థాకరే

ప్రభుత్వాన్ని మార్చేందుకు పోరాడాలి... యువత భవిష్యత్తును బీజేపీ దొంగిలిస్తోంది: ఉద్ధవ్ థాకరే

ముంబై: జవాబుదారీతనంలేని కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేందుకు ఇప్పుడు పోరాటం మొదలు పెట్టాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తుతో బీజేపీ సర్కారు ఆడుకుంటోందని ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. 

మైనస్ డిగ్రీల చలిలో సైనికుల కోసం సోలార్ క్యాంప్ ఏర్పాటు చేసిన, లడఖ్‌‌లో నీటి సమస్య తగ్గించేందుకు పనిచేసిన వాంగ్‌‌చుక్‌‌ను దేశద్రోహి అని ఎలా అంటారని ప్రశ్నించారు. 2011లో అన్నా హజారే దీక్ష చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చిందని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.