మరోసారి వాయిదా పడిన ఫైటర్

మరోసారి వాయిదా పడిన ఫైటర్

ఇంతకుముందు షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ ఓ కొలిక్కి వచ్చాక రిలీజ్ డేట్‌‌‌‌ ఫిక్స్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమాని ప్రకటిస్తున్నప్పుడే విడుదల తేదీని కూడా చెప్పేస్తున్నారు. అయితే చెప్పిన డేట్‌‌‌‌కి వచ్చే సినిమాల్ని వేళ్లపై లెక్క పెట్టొచ్చు. చాలావరకు చిత్రాలు ఆ అడ్డు వచ్చిందని, ఈ వర్క్ మిగిలిందని చెప్పి వాయిదా పడుతూనే ఉంటాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ విషయంలోనూ అదే జరుగుతోంది.  ఈ సినిమా రిలీజ్ ప్లాన్ మాటిమాటికీ మారుతూనే ఉంది. ఇండియాలోనే మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ మూవీ ఇది.

హీరో హీరోయిన్లిద్దరూ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పైలట్స్‌‌‌‌గా కనిపించబోతున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నాయి. పైగా హృతిక్ హీరో. అందుకే ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌‌‌‌లో ఉన్నాయి. ఈ సంవత్సరమే సినిమా విడుదల చేస్తామని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు. కానీ పలుమార్లు డేట్ మార్చి వచ్చే యేడు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌కి ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా 2024, జనవరి 25కి వాయిదా వేశారు. మరి అప్పటికైనా ‘ఫైటర్’ వస్తాడో లేక మళ్లీ ప్లాన్ మారుస్తాడో చూడాలి.