FIH Mens Hockey World Cup: హర్మన్‌‌ప్రీత్‌‌ సారథ్యంలో 20 మంది ఎంపిక

FIH Mens Hockey World Cup: హర్మన్‌‌ప్రీత్‌‌ సారథ్యంలో 20 మంది ఎంపిక

న్యూఢిల్లీ:  ఎఫ్‌‌ఐహెచ్‌‌ మెన్స్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌కు ఇండియా జట్టును మంగళవారం ప్రకటించారు. హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ సారథ్యంలో మొత్తం 20 మందిని ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన ప్రో లీగ్‌‌ యూరోపియన్‌‌ లెగ్‌‌లో పాల్గొన్న 24 మంది సభ్యుల నుంచి నిబంధనల ప్రకారం నలుగురు ప్లేయర్లను తగ్గించారు.

డిఫెండర్‌‌ అమన్‌‌దీప్‌‌ లక్రా, మిడ్ ఫీల్డర్‌‌ రాజ్‌‌ కుమార్‌‌ పాల్‌‌, రబిచంద్ర సింగ్‌‌, సెల్వం కార్తీకి చోటు దక్కలేదు. ఫామ్‌‌ ఆధారంగానే టీమ్‌‌ ఎంపిక జరిగిందని హెడ్‌‌ కోచ్‌‌ క్రెయిగ్‌‌ ఫుల్టన్‌‌ వెల్లడించాడు. పూల్‌‌–డిలో ఇండియా.. వేల్స్‌‌ (ఆగస్టు 15), ఇంగ్లండ్‌‌ (17), పాకిస్తాన్‌‌ (19)తో తలపడనుంది. గ్రూప్‌‌ దశ మ్యాచ్‌‌లన్నీ నెదర్లాండ్స్‌‌లో అమ్‌‌స్టెల్‌‌వీన్‌‌లో జరగనున్నాయి. 


జట్టు వివరాలు: గోల్‌‌ కీపర్లు: మోహిత్‌‌ హెచ్‌‌ఎస్‌‌, సూరజ్‌‌ కర్కేరా.

డిఫెండర్లు: జర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (కెప్టెన్‌‌), అమిత్‌‌ రోహిడాస్‌‌, జుగ్‌‌రాజ్‌‌ సింగ్‌‌, సంజయ్‌‌, సుమిత్‌‌, యశ్‌‌దీప్‌‌ సివాచి.

మిడ్‌‌ఫీల్డర్లు: రాజింద్‌‌ సింగ్‌‌, ఆదిత్య అర్జున్‌‌, హార్దిక్‌‌ సింగ్‌‌, మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, నీలకంఠ శర్మ, వివేక్‌‌ సాగర్‌‌ ప్రసాద్‌‌.

ఫార్వర్డ్స్‌‌: దిల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, శీలానంద్‌‌ లక్రా, సుఖ్‌‌జీత్‌‌ సింగ్‌‌, మన్‌‌దీప్‌‌ సింగ్‌‌, అభిషేక్‌‌.