
- 200 మంది నుంచి రూ.530 కోట్లు వసూలు
హైదరాబాద్, వెలుగు : చాక్లెట్ల డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్స్ పేరుతో రూ.530 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో సినీ నిర్మాత అట్లూరి నారాయణరావును సిటీ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏపీలో ఆయనను అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన గుదే రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృష్ణంరాజును గత నెలలో అరెస్ట్ చేశారు. తక్కువ టైమ్‌లో ఎక్కువ లాభాలిస్తామంటూ ఆశ చూపి ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 200 మంది నుంచి రూ.530 కోట్లు వసూలు చేశారు. నారాయణరావుపై సీసీఎస్‌లో గతంలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి.