- ‘నేషనల్ పోస్టల్ వీక్’ లో భాగంగా ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: యూనివర్సల్ పోస్టల్ యూనియన్ నిర్వహిస్తున్న ‘నేషనల్ పోస్టల్ వీక్’ వేడుకల్లో భాగంగా తెలంగాణ సర్కిల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో సోమవారం అబిడ్స్ లోని డాక్ సదన్ ఆఫీసులో విత్తియా స్వశక్తి కరన్ దివాస్ (ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ డే) జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. పీవీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1874 అక్టోబర్ 9న ప్రారంభమైందన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 9 నుంచి 15 వరకు నేషనల్ పోస్టల్ వీక్ వేడుకలు ఉంటాయన్నారు. ప్రస్తుతం పోస్టల్ ద్వారా దాదాపు 300కుపైగా సర్వీసులను అందిస్తున్నామన్నారు. ఇవన్నీ జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేషనల్ పోస్టల్ వీక్ ద్వారా ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం విత్తియ స్వశక్తి కరన్ దివా
స్ను జరిపామన్నారు.
ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఎంపవర్ మెంట్ సర్వీసెస్లో పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన పార్సిల్ సర్వీసెస్లో కౌంటర్, బుకింగ్స్, డెలివరీ
విభాగాల్లో అమలుచేసిన అంశాల గురించి తెలియజేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణా సర్కిల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె. ప్రకాశ్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
