మొక్కలు తిన్న మేకలకు జరిమానా

మొక్కలు తిన్న మేకలకు జరిమానా

మొక్కలు తింటున్న మేకలకు జరిమానా విధించారు అధికారులు. మేకలు మొక్కలు, గడ్డినే కదా తినేది..అవి తింటే ఫైన్ విధించడం ఏంటనే కదా…అవి తిన్న మొక్కలు హరితాహారం మొక్కలు అందుకే వాటికి ఆ శిక్ష.

తెలంగాణకు హరితహారం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో మొక్కలను నాటి పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో అధికారులు మొక్కలు నాటారు. అయితే కొంతమంది గొర్రెల, మేకల కాపరులు నిర్లక్ష్యంగా వ్యవహరించి హరితహారం లో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నారు. పాల్వంచ నవభారత్ ఏరియాలోని కలెక్టర్ ఆఫీస్ కు సమీపంలో మేకలు హరితహారంలో వేసిన మొక్కలు తింటుండగా… పాల్వంచ శానిటరీ ఇన్స్పెక్టర్ గమనించి వాటిని పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ కు తరలించారు.  మేకలను ఆఫీసులో కట్టేశారు. మొక్కలు తిన్న మేకలకు ఫైన్ విధిస్తామని…జరిమానా చెల్లించి వాటి యజమానులు తీస్కెళ్లాలని తెలిపారు అధికారులు.