కస్టమర్ స్టుపిడ్ క్వశ్చన్‌ : బిల్లు వేసిన రెస్టారెంట్‌‌

కస్టమర్ స్టుపిడ్ క్వశ్చన్‌ : బిల్లు వేసిన రెస్టారెంట్‌‌

ఎక్కడైనా రెస్టారెంట్‌‌కు పోయినప్పుడు మనం తలతిక్క ప్రశ్నలు వేశామనుకోండి. ఖర్మరా బాబూ అనుకుంటూ అక్కడి సిబ్బంది చాలావరకూ ఓపికగానే మనకు ఆన్సర్లు చెప్తుంటరు. కానీ అమెరికాలోని ఓ హోటల్‌‌కు పోయి పిచ్చి  ప్రశ్నలేస్తే.. రూ. 27 బిల్లు వేస్తారట! విచిత్రమైన మెనూతో కస్టమర్లకు ఫన్‌‌ను కూడా వడ్డిస్తున్న  ‘టామ్స్ డైనర్’ అనే ఈ రెస్టారెంట్ అమెరికాలోని డెన్వర్ సిటీలో ఉంది. ఇరవై ఏళ్లుగా ఈ రెస్టారెంట్ పిచ్చి ప్రశ్నలకు బిల్లు వేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోందట. ఈ రెస్టారెంట్ బిల్లును ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఆ బిల్లులో మ్యాష్డ్ పొటాటోస్ 2.99, చిక్ టెండర్స్ బాస్కెట్ 9, ఒక స్టుపిడ్ క్వశ్చన్‌‌కు 0.38 డాలర్ల (రూ.27) చొప్పున చార్జ్ చేసినట్లుగా ఉండటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొసమెరుపేంటంటే.. బిల్లులో అయితే పెట్టారు గానీ, దానికి డబ్బులు మాత్రం వసూలు చేయరట. జస్ట్‌‌ ఫన్‌‌ కోసమే అలా బిల్లు వేస్తారట.