పేమెంట్ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేయూకు పర్మిషన్​

పేమెంట్ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేయూకు పర్మిషన్​

న్యూఢిల్లీ: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, పేటీఎం వంటి పేమెంట్ అగ్రిగేటర్లలా పనిచేసేందుకు ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ పేయూకి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నుంచి అనుమతులు దక్కాయి. కంపెనీ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కిందటేడాది జనవరిలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తిరస్కరించింది. 120 రోజుల్లో తిరిగి సబ్మిట్ చేయాలని అప్పుడు అడిగింది. అనుమతులు దక్కడంతో  ప్రోసస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ ఇక నుంచి కొత్త మర్చంట్లను చేర్చుకోవడానికి,  పేమెంట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడానికి వీలుంటుంది. 

ప్రభుత్వ డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రెగ్యులేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం దేశంలో డిజిటైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించడానికి తాజాగా పొందిన లైసెన్స్ సాయపడుతుందని పేయూ సీఈఓ అనిర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖర్జీ అన్నారు.