
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన గల ఎల్ఐసీ ఆఫీసులో గురువారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం మొత్తం మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.