హైదరాబాద్ పాత బస్తీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ పాత బస్తీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీఏ ఆఫీస్ లో పార్కింగ్ లో ఉన్న రెండు టాటా ఏసీ వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు భయబ్రాంతులకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం పై కేసు నమోదు చేసుకున్నారు.  ఇది ప్రమాదామా లేక ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.