చౌటుప్పల్ మండలంలోని SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

చౌటుప్పల్ మండలంలోని SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో శనివారం (ఆగస్ట్ 23) రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతోన్న మంటలను ఫైరింజన్ల సహయంతో అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.  ప్రమాదానికి గల కారణాలు, ప్రమాద సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నార వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.