16 అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుతీసిన జనం..

16 అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుతీసిన జనం..

జూబ్లీహిల్స్ అగ్నిప్రమాదంపై స్పందించారు ఫిలింనగర్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాబు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో జర్నలిస్ట్ కాలనీలోని IVY బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అన్నారు. సమాచారం అందుకున్న ఐదు నిమిషాల్లో ఘటనస్థలికి చేరుకున్నామని తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న భవనం మొత్తం 16 అంతస్తులు ఉంటుందని చెప్పారు.

 మొదట నుండి ఆరు అంతస్తుల వరకు పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని  నాలుగో ఫ్లోర్  లో అగ్నిప్రమాదం సంభవించిందని వెల్లడించారు. పది పదకొండవ అంతస్తులు రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయని ఆ వర్క్ సంబంధించిన మెటీరియల్ 4 అంతస్థుల భద్రపరిచారు.. అలాగే ఫర్నిచర్ వేస్టేజ్ కూడా ఉందని తెలిపారు. 

ఆ వేస్టేజ్ కు మంటలు వ్యాపించాయని వెంటనే మంటలు ఆర్పి వేశామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఉద్యోగులంతా బయటకి వచ్చారని వెల్లడించారు చంద్ర శేఖర్ బాబు.