హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్లో మంటలు

 హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం..   అపార్ట్మెంట్లో మంటలు

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చక్రిపురంలోని  శ్రీసిరి అపార్ట్మెంట్ లోని ఐదవ అంతస్తులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్ లోని వారంతా బయపడి బయటకు వచ్చేశారు.  వారు వెంటనే  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.   

అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలును అదుపులోకి తీసుకువస్తుపన్నారు.  అయితే ఈ అగ్నిప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణమని తెలుస్తుంది.  ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం  జరగలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.