హైదరాబాద్ మలక్పేట్లో అగ్ని ప్రమాదం ..బేకరీ దగ్ధం

హైదరాబాద్ మలక్పేట్లో అగ్ని ప్రమాదం ..బేకరీ దగ్ధం

హైదరాబాద్ లోని మలక్ పేట్ లో తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. మలక్ పేట్, మూసారాంబాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో రెడ్ రోజ్ బేకరి పూర్తిగా తగలబడిపోయింది.  ప్రమాదంతో తీవ్ర నష్టం జరిగిందని చెప్తున్నారు షాపు యజమానులు.