హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. 2026 ఏప్రిల్ 13న ఉదయం రెడ్ హిల్స్ లోని మూడంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. మూడో ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో కింది రెండు ఫ్లోర్లలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. మూడో ఫ్లోర్ లో 23 మంది ఉండటం భయాందోళనలకు గురిచేసింది.
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు ఇతర ఫ్లోర్స్ కు వ్యాపించకుండా అదుపు చేశారు.
బిల్డింగ్ లో ఉన్న 23 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
