కొమరంభీం జిల్లాలో అగ్ని ప్రమాదం

కొమరంభీం జిల్లాలో అగ్ని ప్రమాదం

కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని నవేగుడా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. జొన్న చెప్పకు నిప్పంటుకుని, పక్కనే ఉన్న రెండు ఇళ్ళకు మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఫైరింజన్ సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే రెండిళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బాధితులకు వాంకిడి జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు 5లక్షల ఆర్థిక సాయం అందచేశారు.