కోల్‌కతాలోని మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతాలోని మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతాలోని అక్రోపోలిస్ మాల్ లో శుక్రవారం (జూన్ 14) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ లోని 5వ అంతస్థులోని ఫుడ్ కోర్టులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి.  మాల్ లో ఉన్న కస్టమర్స్, విజిటర్స్ భయంతో పరుగులు తీశారు. 

స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి వచ్చిన 10 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై  జాదవ్‌పూర్ డివిజన్ డీసీపీ బిదిషా కలితా దాస్‌గుప్తా మాట్లాడుతూ... అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.