హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా   మైలార్ దేవ్ పల్లి కాటేదాన్  పారిశ్రామిక వార్డులో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి.  హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న  నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి.  

దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బంది అవుతోంది. రబ్బరు ఎక్కువగా ఉండటంతో మంటలు   మంటలు అదుపులోకి రావడం లేదు.   ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.   

ఇటీవలే పటాన్ చెరు పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద మృతుల కుటుంబాలకు సిగాచీ కంపెనీ ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది.