వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నవంబర్ 12న షార్ట్ సర్కుట్ తో లిమ్రా కిడ్స్ వేర్స్ రెడీమెంట్ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి.
మంటల ధాటికి షాపు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో బట్టలు, సామాగ్రి కాలి బుడిదయ్యాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
