- మహారాష్ట్రలో నాగ్‌పూర్ నేషనల్ హైవేపై ఘటన
ముంబై: ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలు.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ లగ్జరీ బస్సు ముంబై నుంచి 12 మంది ప్రయాణికులతో జల్నాకు బయలుదేరింది.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగ్‌పూర్ నేషనల్ హైవేపై ఆ బస్సుకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును రోడ్డు పక్కన ఆపి లోపల ఉన్న 12 మంది ప్రయాణికులను కిందకు దింపాడు. ఆ తర్వాత ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైవే పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను ఆర్పేశారు.
