పాతబస్తీలో అగ్ని ప్రమాదం

పాతబస్తీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి చార్మినార్ దగ్గర ఉన్న యునాని ఆసుపత్రిలోని ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దుకాణదారులు, జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు,  రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అట్టపెట్టల స్క్రాప్ గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్  కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటిహుటినా సంగటానాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.