కేటీఆర్ చెప్పేంతవరకు రాని అగ్నిమాపక సిబ్బంది

కేటీఆర్ చెప్పేంతవరకు రాని అగ్నిమాపక సిబ్బంది
  • షార్ట్​ సర్క్యూట్​తో 50 ఇండ్లలో కాలిపోయిన సామాగ్రి
  • మంత్రి కేటీఆర్ ​ఆదేశించాకే వచ్చిన ఫైర్ సిబ్బంది

సికింద్రాబాద్,వెలుగు: విద్యుత్ షార్ట్  సర్క్యూట్ తో ఇంట్లో మంటలు లేచి మరో 50 ఇండ్లలో వస్తువులు కాలిపోయిన ఘటన సికింద్రాబాద్ పరిధి సీతాఫల్​మండి మేడిబావి లో గురువారం రాత్రి జరిగింది.  అగ్ని ప్రమాదంపై వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్​చేసినా చెప్పినా ఎవరూ స్పందించ లేదు.  మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​లో ట్వీట్​చేయగా, ఆయన ఆదేశాలతో అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.  గంటపాటు మంటలు అంటుకుని కాలనీలోని 50 ఇండ్లలోని ఫ్రిజ్​లు, ల్యాప్​టాప్​లు , టీవీలు తదితర ఎలక్ర్టానిక్​ వస్తువులు కాలిపోయాయి. కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్​ట్రాన్స్​ఫార్మర్​ను సరిగా అమర్చకపోవడంతోనే  షార్ట్  సర్క్యూట్ జరిగిందని స్థానికులు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. ఇండ్లలో కాలిపోయిన వస్తువులకు నష్ట పరిహారం ఇప్పించాలని కాలనీ వాసులు కోరారు.