నాంపల్లిలో 4 గంటలుగా ఆగని మంటలు.. రోబో సాయంతో రెస్క్యూ ఆపరేషన్

నాంపల్లిలో 4 గంటలుగా ఆగని మంటలు.. రోబో సాయంతో రెస్క్యూ ఆపరేషన్

హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తుల బిల్డింగ్‎లో మొదట గ్రౌండ్ ఫ్లోర్‎లో చెలరేగిన మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దాదాపు నాలుగు గంటలుగా మంటలు అదుపులోకి రాలేదు. 10 ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తు్నారు. రోబో సాయంతో రెస్క్యూ ఆపరేషన్మం కొనసాగిస్తున్నారు.

గంట గంటకు ఎక్కువ అవుతుండటంతో బిల్డింగ్ లోపల చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను రక్షించేందుకు బిల్డింగ్ నాలుగు ఫ్లోర్ల గ్లాస్‎లు బ్రేక్ చేశారు రెస్క్యూ సిబ్బంది. వాటర్ స్ప్రే చేయడంతో పొగ దట్టమైన అలుముకుంది. దట్టమైన పొగల కారణంగా రెస్య్కూ ఆపరేషన్ ఇబ్బంది మారింది. ప్రమాదం జరిగిన పక్క బిల్డింగ్ వారు ఖాళీ చేయాలని అధికారులు మైక్‎లో అనౌన్స్ చేశారు.

Also Read : నాంపల్లిలో అదుపులోకి రాని మంటలు

సమీపంలోని దుకాణాలను క్లోజ్ చేయించారు. నాంపల్లి నుమాయిష్‎కు వచ్చే సందర్శకులకు ఎగ్జిబిషన్ పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కలెక్టర్ హరి చందనా, సీపీ సజ్జనార్, ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను పరిశీలించారు. సీపీ సజ్జనార్, ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్  గంట నుంచి నేరుగా రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. 

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నీచర్ షాప్‎లో మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. బిల్డింగ్ సెల్లార్‎లో ఫైర్ స్టార్ట్ అయిందని చెప్పారు. బిల్డింగ్‎లో  ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు సమాచారం ఉందని.. వారిని రక్షించేందుకు సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో రెస్క్యూ రిస్క్‎గా మారిందన్నారు.