హైదరాబాద్ నారాయణ స్కూల్ లో మంటలు : సురక్షితంగా బయటపడిన పిల్లలు

హైదరాబాద్ నారాయణ స్కూల్ లో మంటలు : సురక్షితంగా బయటపడిన పిల్లలు

హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి సమీపంలోని నారాయణ స్కూల్ లో క్యాంపస్ లో మంటలు వచ్చాయి. సెల్లారు నుంచి దట్టమైన పొగలతో మంటలు రావటం భయాందోళనలకు గురి చేసింది. 2026, ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే.. మదీనాగూడలోని నారాయణ స్కూల్‌  సెల్లార్ నుంచి భారీగా పొగలు వెలువడటంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 విద్యార్థులంతా క్షేమంగా బయటపడటంతో  పెను ప్రమాదం తప్పింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు పోలీసులు.