బద్రీనాథ్ విరాళాల చోరీ కేసులో తొలి అరెస్ట్.. బీకేటీసీ అధికారిని అదుపులోకి తీసుకున్న సిట్

బద్రీనాథ్ విరాళాల చోరీ కేసులో తొలి అరెస్ట్.. బీకేటీసీ అధికారిని అదుపులోకి తీసుకున్న సిట్

బద్రీనాథ్ ఆలయం విరాళాల చోరీ కేసులో తొలి అరెస్ట్ .. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ధామ్ లో విరాళాల దుర్వినియోగం కేసులో బద్రీనాథ్ కేదారినాథ్ ట్రస్ట్ కమిటీ అధికారి  ప్రమోద్ నౌటియాల్ ను  సిట్ అరెస్ట్ చేసింది. నౌటియాన్ ను నిన్న (జూలై 12) సాయంత్రం డెహ్రడూన్ అరెస్ట్ చేసి బద్రీనాథ్ కు తీసుకువచ్చారు. బద్రీనాథ్ ఆలయం విరాళాల చోరీ కేసు వెలుగులోకి రావడంతో  ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం  విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా తొలి అరెస్ట్ ఇది. 

పుణ్యక్షేత్రంలో కానుకల లెక్కింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలక్రమంలో  జూలై 2న ఈ వివాదం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో  సీఎం పుష్కర్  సింగ్ థామి విచారణను సిట్ కు అప్పగించారు. బీకేటీసీ కి చెందని నలుగురు సభ్యులు కమిషన్ కూడా ఇవాళ రిపోర్టును సమర్పించింది. సీసీటీవీ ఫుటేజ్, ఉద్యోగుల వివరణ, అలాగే విరాళాలు ,కానుకల లెక్కింపులో తేడాలకు సంబంధించిన అంశాలు ఈ రిపోర్టులో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను సిట్ అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు.  దోషులని తేలితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

బద్రీనాథ్ ఆలయ విరాళాలు చోరీ అయ్యాయని సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అయిన తర్వాత రాజకీయంగా , భక్తులలో ఆందోళనకు దారితీసింది. ఈ ఆరోపణలతో ఉత్తరాఖండ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి, మతగురువులు, ట్రస్ట్ సభ్యులు బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు కోరాయి.