జులై 27 నాటికి ఇండియాకు రానున్న రాఫెల్ జెట్స్

జులై 27 నాటికి ఇండియాకు రానున్న రాఫెల్ జెట్స్
  • ఆరు ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ కు అందే చాన్స్
  •  అంబాలాలో ఫస్ట్ బేస్.. హసిమరాలో రెండో బేస్

చైనాతో బార్డర్ లో తలెత్తిన టెన్షన్ల కారణంగా మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో రాఫెల్ ఫైటర్ జెట్లు చేరనున్నాయి. జులై 27 నాటికి ఫస్ట్ బ్యాచ్ కింద ఆరు రాఫెల్ ఫైటర్ జెట్లు మన దేశానికి రానున్నాయి. ఈ ఆరు రాఫెల్‌ జెట్లు ఐఏఎఫ్ కు అందనున్నాయి. గల్వాన్ లోయలో మన బలగాలపై చైనా దాడులు, ఆ తర్వాత బార్డర్ లో ఏర్పడిన టెన్షన్ల కారణంగా రెండు వారాలుగా ఐఏఎఫ్ హైఅలర్ట్ లో ఉంది. ఏడు వారాలుగా ఇండియా, చైనా బలగాల మధ్య ఏదో రకమైన వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నెల 2న డిఫెన్స్  మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్.. ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. కరోనా వైరస్ కారణంగా అడ్డంకులు ఎదురైనా అనుకున్న సమయానికే రాఫెల్ జెట్లను డెలివరీ చేస్తామని రాజ్ నాథ్ కు ఆమె హామీ ఇచ్చారు. రాఫెల్ జెట్ల రాకతో ఐఏఎఫ్ కాంబాట్ కెపాసిటీ పెరుగుతుందని, మన ప్రత్యర్థులకు కూడా గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని మిలిటరీ వర్గాలు తెలిపాయి. రాఫెల్ జెట్లకు ఫస్ట్ స్క్వాడ్రాన్ గా అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉండే అవకాశం ఉంది. ఐఏఎఫ్ కు సంబంధించి స్ట్రాటజికల్ గా కీలకమైన ప్రదేశం అంబాలా. ఇక రెండో స్క్వాడ్రాన్ బెంగాల్లోని హసిమరాలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఐఏఎఫ్ ఇప్ప టికే రాఫెల్ జెట్లకు వెల్కం చెప్పేందుకు ప్రిపరేషన్ మొదలు పెట్టింది దానికి అవసరమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను కూడా రెడీ చేస్తోంది. మరోవైపు పైలట్లకు ట్రైనింగ్ కూడా ఇస్తోంది. రెండు ఎయిర్ బేస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైలట్ల ట్రైనింగ్ కోసం ఐఏఎఫ్ దాదాపు రూ.400 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది. 36 రాఫెల్ ఫైటల్ జెట్ల కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్ తో మనదేశం రూ.58 వేల కోట్ల విలువైన అగ్రిమెంట్ కుదుర్చుకుంది.