జైల్లో ఉన్నా రాజభోగమే..ముంబై ఆర్థూర్ రోడ్ జైలులో.. కార్పొరేట్ హంగులతో మెహల్ చోక్సీ గది..ఫొటోలు వైరల్

జైల్లో ఉన్నా రాజభోగమే..ముంబై ఆర్థూర్ రోడ్  జైలులో.. కార్పొరేట్ హంగులతో మెహల్  చోక్సీ గది..ఫొటోలు వైరల్

ఉన్నోడికి రాజభోగం.. లేనోడికి కఠిన కారాగారం అంటే ఇదేనేమో.. బెల్జియంలో దాక్కున్న  వేలకోట్ల కుంభకోణంలో దోషి మెహల్​ చోక్సీని భారత్​ కు అప్పగించే ఏర్పాటు జరుగుతున్నాయి. మొహల్​ చోక్సీని ఇం డియాకు తీసుకొస్తే ముంబైలోని ఆర్థూర్​ జైలు ఉంచేందుకు భారత్​ కూడా ఏర్పాట్లు చేసింది. అయితే మెహల్​ చోక్సీ ని ఉంచే జౌలు గది పరిసరాల ప్రాంతాలను, అతనికి సమకూర్చిన వసతులను చూస్తే.. పైన చెప్పిన నానుడి నిజమే అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. 

మెహల్​ చోక్సీ..పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​13వేల కోట్ల భారీ కుంభకోణంలో నిందితుడు. దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి. బెల్జియంలో దాక్కున్నాడు. పారిపోయిన మెహుల్ చోక్సీ అప్పగింత కేసులో భారత్​తెలిపిన నేరాలను కూడా బెల్జియన్ చట్టం ప్రకారం నేరాలుగా గుర్తించినట్లు బెల్జియం కోర్టు నిర్ధారించింది. ఇక అప్పగింతే మిగిలింది.. అయితే బెల్జియం చట్టాల ప్రకారం.. నిందితుడి ఉంచే జైలు, అక్కడి సౌకర్యాలు, అతని భద్రత వంటి కీలక అంశాలపై భారత్​ ఆ దేశానికి ఫ్రూఫ్​ లను చూపించాల్సి ఉంటుంది.. అందుకే మెహల్​ చోక్సీ ఉంచే ముంబైలోని ఆర్థూర్​ జైలులో అతని గది, పరిసరాలు, అందులో సౌకర్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది భారత ప్రభుత్వం. 

మోహల్​ చోక్సీని ఉంచే సెల్​లో తగినంత సూర్యరశ్మీ, మూడు కీటికీలు, స్వచ్ఛమైన గాలిని అందించే ఐదు క్రాస్​ వెంటివేటర్లు. లైట్లు ఆన్ చేసిన తర్వాత, ఆరు వేలాడే ట్యూబ్ లైట్లు సెల్ లో తగినంత కాంతిని అందిస్తాయి. మూడు సీలింగ్ ఫ్యాన్లు ,వార్తలు ,వినోదం కోసం ఎల్​ఈడీ టీవీ ఉన్నాయి. ఈ సెల్‌లో రోజువారీ వినియోగం కోసం అన్ని సౌకర్యాలతో కూడిన అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది.

ఇక బ్యారక్ వెలుపల ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడకకు వెళ్ళడానికి విశాలమైన ప్రదేశం ఉంది. మెహల్ చోక్సీ జైలులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. సేమ్​ ఫీలింగ్​ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వివరాలను బెల్జియం ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది భారత ప్రభుత్వం. 

ఏంటీ పీఎన్‌బీ స్కామ్ ..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటి. ఇందులో దాదాపు రూ. 13వేల కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయి. ఈ కుంభకోణం 2018 ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ,అతని మామ మెహుల్ చోక్సీ మరి కొంతమంది PNB ఉద్యోగులతో కలిసి ఈ కుంభకోణానికి కుట్ర చేశారు. 

►ALSO READ | viral video: దీపావళి కొత్త ట్రెండ్ వైరల్.. షేక్ హ్యాండిస్తే చేతులనుంచి మంటలొస్తాయి.. ఏంటిదీ? ఎలా చేయడం?

విదేశీ రుణాల కోసం జారీ చేయబడిన బ్యాంక్ హామీలైన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoU)లను దుర్వినియోగం చేయడం ద్వారా ఈ మోసం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి 2018 మధ్య ముంబైలోని PNB బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లోని ఇద్దరు ఉద్యోగులు SWIFT వ్యవస్థ ద్వారా అనధికారిక LoUలను జారీ చేశారు. వాటిని బ్యాంకు ప్రధాన వ్యవస్థలలో నమోదు చేయలేదు. దీంతో డైమండ్ R US, సోలార్ ఎక్స్‌పోర్ట్స్ ,స్టెల్లార్ డైమండ్స్‌తో సహా నీరవ్ మోడీ సంస్థలు సరైన పూచీకత్తు లేకుండా ఇతర భారతీయ బ్యాంకుల విదేశీ శాఖల నుంచి క్రెడిట్ పొందగలిగాయి. ఫలితంగా 13వేల కోట్ల భారీ స్కాం జరిగింది. 

ప్రస్తుతం బెల్జియంలో దాక్కున్న మెహల్​ చోక్సీని అక్కడి కోర్టులు కూడా దోషిగా తేల్చాయి.. భారత్​ కు అప్పగించేందుకు బెల్జియం సిద్దంగా ఉంది..ఫార్మాలిటీస్​ లో భాగంగా మెహల్​ చోక్సీని ఉంచే జైలు వివరాలను భారత్​..బెల్జియం ప్రభుత్వానికి పంపించేందుకు సిద్దం చేసింది.