viral video: దీపావళి కొత్త ట్రెండ్ వైరల్.. షేక్ హ్యాండిస్తే చేతులనుంచి మంటలొస్తాయి.. ఏంటిదీ? ఎలా చేయడం?

viral video: దీపావళి  కొత్త ట్రెండ్ వైరల్.. షేక్ హ్యాండిస్తే చేతులనుంచి మంటలొస్తాయి.. ఏంటిదీ? ఎలా చేయడం?

ట్రెండింగ్​ లో ఉండటం అంటే యూత్​ చాలా సరదా.. రకరకాల యాక్టివిటీస్​ తో యువత సోషల్​ మీడియాలో ఎక్కువ దృష్టిని ఆకర్షించేందుకు తపన పడుతుంటారు. ట్విట్టర్, ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రామ్​,టిక్​ టాక్​వంటి సోషల్​ మీడియాలో ప్లాట్​ ఫాంలలో నెటిజన్లను ఆకట్టుకునేందుకు వారి టాలెంట్​ ను ప్రదర్శిస్తుంటారు.. కామెడీ, సీరియస్ , సెంటిమెంట్ పండిస్తుంటారు. కొత్త కొత్త ఐడియాలను పరిచయం  చేస్తూ ఎంటర్​ టైన్​ చేస్తుంటారు.. అలాంటిదే ఈ దీపావళి సందర్భంగా కొత్త ట్రెండ్ వైరల్​అవుతోంది..

ఈ దీపావళికి యూత్ కొత్త ట్రెండ్​ను పరిచయం చేశారు. అదే ఫైర్​ షేక్​ హ్యాండ్.  సోషల్​ మీడియాను షేక్​ చేసింది. షేక్​హ్యాండ్​ చేస్తే చాలు.. చిన్నపాటి బ్లాస్ట్​ జరిగి చేతుల్లోంచి మంటలొస్తాయ్.. ఇది దీపావళి వేడుకల్లో స్పార్క్​ ను సృష్టించింది. ఇది బాగా ఆకట్టుకుంటోంది. అయితే సరైన భద్రతా జాగ్రత్తలు లేకుండా దీనిని ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ట్రెండ్ కొన్ని వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ,యూట్యూబ్ షార్ట్‌లలో స్నేహితులు కరచాలనం చేసే ముందు మండే హ్యాండ్ శానిటైజర్లు, పెట్రోల్ లేదా ఏరోసోల్ స్ప్రేలను మండించడంతో మొదలవుతుంది. దీంతో వారి అరచేతుల మధ్య కొద్దిసేపు మంటలు చెలరేగాయి. ఈ వీడియోలు త్వరగా మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందాయి. క్రియేటర్లు దీనిని దీపావళి ఫైర్ హ్యాండ్‌షేక్ అని పిలుస్తారు.

థి వైరల్ ట్రెండ్ ఎలా చేయాలంటే.. 

క్రియేటర్లు ముందుగా ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ను పలుచని పొరగా  వారి అరచేతులకు పూసుకుంటారు..ఈ పదార్థం చాలా మండే స్వభావం ఉంటుంది. సులభంగా మంటలను ఆర్పుతుంది కానీ ఏమాత్రం తేడా వచ్చినా.. తీరని నష్టం కలగవచ్చు. కొందరు ప్రత్యేకమైన ఫ్లాష్ పేపర్‌ను కూడా ఉపయోగిస్తారు. ఇది తక్షణమే మండుతుంది ,అవశేషాలు లేకుండా కాలిపోతుంది. జ్వాల మిణుకుమిణుకుమంటున్న వెంటనే హ్యాండ్‌షేక్ జరుగుతుంది. ఇది ఒక చేతి నుంచి మరొక చేతికి ఫైర్​ ను బదిలీ చేస్తున్నట్లు భ్రమను కలిగిస్తుంది. 

ఇక ఈ వీడియోలు చూసిన ఫైర్​ డిపార్టుమెంట్​ అధికారులు ఈ స్టంట్ చేయడం మంచిదికాదు.. దీపావళి వెలుగులు, ఆనందాన్ని పొందేందుకు వీటికీ ప్రత్యామ్నాయంగా చాలా ట్రిక్​ లు ఉన్నాయి. ఫైర్​ షేక్ హ్యాండ్ తో తీవ్రమైన కాలినగాయాలు, బొబ్బలు లేదా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం  ఉందని హెచ్చరిస్తున్నారు.