
బంగార్రాజు తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్న మూవీ ‘ది ఘోస్ట్’. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.‘వేగమ్’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ మదినేని రచించగా.. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. భరత్-సురభ్ స్వరాలందించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.