సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన'. సుభాష్ చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ హీరోయిన్. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘నేను నా పల్లెటూరు’ అనే పాటను విడుదల చేశారు. పల్లె జ్ఞాపకాలను, అక్కడి మట్టివాసనను, గోదావరి తీరాల అందాన్ని ప్రజెంట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. నాగవంశీ కంపోజ్ చేయగా ఎంఎల్‌ఆర్ కార్తికేయ పాడాడు. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

