సూర్య, మమిత బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
శుక్రవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా, చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా, గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావు నాలోని ప్రేమని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని.. నేనో బటర్‌ఫ్లై.. నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే..’ అంటూ హీరో సూర్యను ఉద్దేశించి, మమిత బైజు పాడుకునే పాట కలర్‌ఫుల్‌గా సాగింది.
జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా, ‘రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే’ అంటూ ప్రేమలోని ఇన్నోసెంట్, ఎనర్జీ, ఎమోషన్‌ను రిఫ్లెక్ట్ చేసేలా రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుబ్లాషిని ఎనర్జిటిక్‌గా పాడింది.
సూర్య, మమిత బైజు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
