భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మెగాస్టార్ గ్రేస్ పీక్స్ అబ్బా!

భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మెగాస్టార్ గ్రేస్ పీక్స్ అబ్బా!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. భోళా మ్యానియా అంటూ వచ్చిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్(Mahati swara sagar) అందించిన ఈ ట్యూన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సాంగ్ లో బాస్ వేసిన గ్రెస్ ఫుల్ స్టెప్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు శేఖర్(Shekhar VJ) కోరియోగ్రఫీ చేశాడు.

 పక్కా మాస్ బీట్ తో ఉన్న ఈ పాట ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేయనుంది. మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తుంది. ఇక చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) నటిస్తున్న ఈ సినిమాలో.. హీరో సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా కవడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మొదటిపాటతో ఫుల్ కిక్కిచ్చిన ఈ సినిమా రిలీజ్ తరువాత కూడా అదే రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

https://www.youtube.com/watch?v=91RtI6ZG2bc