ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే ఉంది.. ఇదిగో సాక్ష్యం

ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే ఉంది.. ఇదిగో సాక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా సోషల్​ మీడియా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనుభవంలో ఉన్నదే. ఇంటర్నెట్​ యాక్సెస్​విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలైన వాట్సప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​తదితర యాప్​లు చాలా మంది వినియోగిస్తున్నారు. వీటికి కోట్లలో సబ్​స్కైబర్స్​ఉన్నారంటే.. సోషల్​ మీడియా ప్రభావం ఎంతగా ఉందో చెప్పవచ్చు. అయితే తాజాగా వచ్చిన ఓ అధ్యయనం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రపంచ జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ  మంది సోషల్​ మీడియాలో నిత్యం యాక్టివ్​గా ఉంటున్నారని ఆ అధ్యయన సారాంశం. 

డిజిటల్​ అడ్వైజరీ సంస్థ కెపియాస్​ తన క్వార్టర్లీ రిపోర్ట్​లో ప్రచురించిన లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా  దాదాపు ఐదు బిలియన్ల కంటే ఎక్కువ మంది  సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారు. ఇది గతేడాది కంటే 3.7 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. తూర్పు, మధ్య ఆఫ్రికాలో ప్రతి 11 మందిలో ఒకరు మాత్రమే వీటిని యూజ్​ చేస్తుండగా.. ఇండియాలో ఈ సంఖ్య మూడింటిలో ఒకటిగా ఉంది. దీంట్లో గడిపే టైం కూడా రోజుకు 2 నిమిషాల నుంచి 2 గంటల 26 నిమిషాలకు పెరగడం దాన్ని ప్రభావం ఎంతలా ఉందో సూచిస్తోంది. ఇందులో మళ్లీ ప్రాంతాలను బట్టి తేడాలున్నాయి. 

బ్రెజిల్​లో రోజుకు సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్​ మీడియాలో గడుపుతుండగా, జపనీయులు తక్కువ టైం స్పెండ్​ చేస్తున్నారు. చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్లాట్​ఫాంల లిస్టులో వాట్సప్​, ఇన్​స్టా గ్రామ్​, ఫేస్​బుక్ ఉన్నాయి.