పంజాగుట్ట: ఫెసపల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ ప్లేయర్లు

పంజాగుట్ట: ఫెసపల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కు  హైదరాబాద్ ప్లేయర్లు

పంజాగుట్ట, వెలుగు: ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న ఫెసపల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్ పోటీలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫెసపల్లో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుక దాస్ జెన్వాడ్కర్ ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించారు. తెలంగాణలో శిక్షణ పొందిన విశాల్, ఉద్దేశ్, జూగూటి ఆర్‌‌‌‌‌‌‌‌.ఎన్‌‌‌‌‌‌‌‌. అక్షయ్, వైష్ణవ్, అరుణ్ సాయి భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. 

ఆస్ట్రేలియాలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరిగే ఈ టోర్నీలో 10 దేశాల జట్లు పాల్గొంటాయని చెప్పారు. అనంతరం పోటీల పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ క్రీడను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి జైదీప్ లఖానే, ప్రతినిధులు మయూర్ ఆకుల, విశాల్, మనీషా భారతీయ తదితరులు పాల్గొన్నారు.