టెర్రర్‌‌ లింకులు.. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

టెర్రర్‌‌ లింకులు.. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

శ్రీనగర్: టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో మరో అయిదుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూకాశ్మీర్‌‌‌‌ అధికారులు బుధవారం వేటు వేశారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుల్స్‌‌ కూడా ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్‌‌ టెర్రరిస్టు గ్రూపుతో కలిసి ‌‌పనిచేస్తున్నట్టు, ఇద్దరు సహోద్యోగులను చంపడానికి ప్రయత్నించాడనే ఆరోపణలను కూడా కానిస్టేబుల్‌‌ తౌసీఫ్‌‌ అహ్మద్‌‌ మీర్‌‌ ఎదుర్కొంటున్నాడు. రాష్ట్ర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్‌‌ 311 (2) (సి) ప్రకారం కమిటీ సిఫార్సును అనుసరించి ఎటువంటి విచారణ లేకుండానే ఉద్యోగులను డ్యూటీల నుంచి తొలగించారు. తాజాగా తొలగించిన ఉద్యోగులతో కలిపి సంవత్సర కాలంలో మొత్తం 34 మందిని విధుల నుంచి తొలగించారు. కానిస్టేబుల్‌‌ షాహిద్ హుస్సేన్ రాథర్, గులామ్‌‌ హసన్ పారే, అర్షద్ అహ్మద్ దాస్, షరాఫత్ అలీ ఖాన్‌‌ విధుల నుంచి 
తొలగించిన వారిలో ఉన్నారు.