గాంధీలో అదనంగా 5  ఓపీ కౌంటర్లు

గాంధీలో అదనంగా 5  ఓపీ కౌంటర్లు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​ఓపీ బ్లాక్​లో  పేషెంట్లకు ఆలస్యం కాకుండా అదనంగా 5 ఓపీ రిజిస్ట్రేషన్​ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్​ ప్రొ. రాజారావు తెలిపారు. ఇటీవల గాంధీలో  షార్ట్​ సర్క్యూట్ ​కారణంగా తలెత్తిన సాఫ్ట్​వేర్​ సమస్యలతో  ఓపీ బ్లాక్​  కంప్యూటర్​ వ్యవస్థ పని చేయకపోవడంతో కంప్యూటరైజ్డ్​ స్లిప్స్​కు బదులుగా మాన్యువల్​గా కాగితాలపై ఓపీ చిట్టీలు రాసి ఇస్తున్నారు. దీంతో పేషెంట్లు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్​ పేషెంట్లకు స్లిప్స్​అందించేందుకు మరో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం గాంధీలో 20 బ్లాక్​ఫంగస్​ కేసులు, 58 కొవిడ్​ పాజిటివ్​ కేసులున్నాయని సూపరింటెండెంట్ ​తెలిపారు. ప్రతి రోజు ఐదుగురు కొవిడ్​ పేషెంట్లు పూర్తిగా కోలుకొని డిశ్చార్జీ అవుతుండగా, మరో ఐదుగురు పేషెంట్లు అడ్మిట్​ అవుతున్నారని చెప్పారు. డైట్ ​క్యాంటీన్​ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, బుధవారం ప్రభుత్వం తరపున కౌంటర్​ దాఖలు చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావును కలిసి గాంధీ సమస్యలను వివరించామని, త్వరలో మంత్రి గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తారని తెలిపారు. 


గాంధీలో  చిల్ర్డన్స్​ డే
గాంధీ హాస్పిటల్​ పీడియాట్రిక్​ సర్జరీ విభాగంలో  సోమవారం డాక్టర్లు చిల్ర్డన్స్​డే వేడుకలను నిర్వహించారు. చీఫ్​గెస్ట్​గా హాజరైన డీఎంఈ  డా.కె.రమేశ్​రెడ్డి కేక్​ కట్ చేసి చిన్నారులకు గిఫ్ట్​లను అందచేశారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్​ డా.రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్​ డా.ప్రకాశ్​రావు, పీడియాట్రిక్​ సర్జరీ హెచ్​వోడీ డా. నాగార్జున, అసోసియేట్​ ప్రొఫెసర్​ డా.శ్రీనివాస్, ఫ్యాకల్టీ మెంబర్స్, పీజీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.