తెలంగాణకు మరో ఐదు హ్యాండ్లూమ్ క్లస్టర్లు

తెలంగాణకు మరో ఐదు హ్యాండ్లూమ్ క్లస్టర్లు

న్యూఢిల్లీ, వెలుగు: చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు గాను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ హెచ్ డీపీ) కింద ఐదు స్మాల్ క్లస్టర్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్​లను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఉన్నాయి. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని దయానంద, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కొండపలకల, జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, సిద్ధిపేట జిల్లాలోని శ్రీరాములపల్లి, నల్గొండ జిల్లాలోని మునుగోడులో ఈ ఐదు హ్యాండ్లూమ్‌‌‌‌‌‌‌‌ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. 

రూ.5.43 కోట్లతో ఏర్పాటయ్యే ఈ ఎస్ సీడీపీల్లో కేంద్ర వాటా రూ.5.16 కోట్లు కాగా లబ్ధిదారుల వాటా రూ.27.115 లక్షలుగా పేర్కొంది. ఈ క్లస్టర్లకు ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2.17 కోట్లు విడుదల చేయనుంది. ఎస్ సీడీపీల పెర్ఫార్మెన్స్, ఇతర నిబంధనల అమలు ఆధారంగా సెకండ్ ఫేజ్ ఫండ్స్ విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, తెలంగాణకు ఐదు క్లస్టర్లు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌కు ధన్యవాదాలు తెలిపారు.