బాలి (ఇండోనేసియా): ఇంటర్నేషనల్ టీ20ల్లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇండోనేసియా ఫాస్ట్ బౌలర్ గేడ్ ప్రియందన
(1–0–1–5) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఎనిమిది టీ20ల సిరీస్‌లో భాగంగా కంబోడియాతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రియందన ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియా 60 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఆ టీమ్ 167/5 స్కోరు చేసింది.
ఛేజింగ్‌లో కంబోడియా 15 ఓవర్లకు 105/5తో నిలిచింది. కానీ, 16వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ప్రియందన తొలి మూడు బాల్స్‌కు షా అబ్రార్ (37), నిమ్రల్‌జీత్ (0), రథనాక్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. నాలుగో బాల్ డాట్ అవ్వగా.. ఓ వైడ్ వేసిన ప్రియందన చివరి రెండు బాల్స్‌కు మొంగ్దార సోక్ (0), పెల్ వెనాక్ (0)ను కూడా ఔట్ చేసి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా ఇంటర్నేషనల్ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఇండియా క్రికెటర్ అభిమన్యు మిథున్, బంగ్లాదేశ్ బౌలర్ అల్-అమీన్ హుస్సేన్ డొమెస్టిక్ టీ20ల్లో ఈ ఘనత సాధించగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇదే మొదటిసారి.
