ఘట్ కేసర్ లో ఐదేండ్ల చిన్నారి దారుణ హత్య

ఘట్ కేసర్ లో  ఐదేండ్ల చిన్నారి దారుణ హత్య
  • పోచారంలో ఉంటున్న అనూష, కల్యాణ్ దంపతులు
  • కరుణాకర్​తో అనూషకు పరిచయం.. తర్వాత రాజశేఖర్​తో ఫ్రెండ్​షిప్
  • అనూష తనను దూరం పెడుతోందని కక్షపెంచుకున్న కరుణాకర్
  • అనూష ఇంటికెళ్లి గొడవ.. ఆమె బిడ్డపై సర్జికల్ బ్లేడ్​తో దాడి
  • ఆపై తాను గొంతు, చెయ్యి కోసుకున్నాడు..
  • కరుణాకర్, రాజశేఖర్ అరెస్టు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు:అభంశుభం ఎరుగని చిన్నారి ఓ వ్యక్తి ఉన్మాదానికి బలి అయింది. ఐదేండ్ల పాపను గొంతుకోసి చంపాడో సైకో. మేడ్చల్‌‌‌‌ జిల్లా ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌లో గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధమే చిన్నారి హత్యకు దారి తీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇంకొకరితో చనువుగా ఉందని..

భువనగిరికి చెందిన కల్యాణ్.. ఆత్మకూర్‌‌‌‌‌‌‌‌ పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. 2011లో అనూషను లవ్‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌ చేసుకున్నారు. వీరికి 2 015లో ఆధ్యా రావు(5) పుట్టింది. వీరు మూడేండ్ల నుంచి ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌‌‌‌గూడ విహారి హోమ్స్‌‌‌‌లో ఉంటున్నారు. కల్యాణ్ రోజూ ఇస్మాయిల్‌‌‌‌గూడ నుంచి ఆత్మకూరుకు డ్యూటీకి వెళ్లి వస్తుండే వారు. అనూష తన కూతురు ఆధ్యతో కలిసి ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో మూడేండ్ల కింద అనూషకి కరుణాకర్‌‌‌‌తో పరిచయం అయ్యింది. రాజశేఖర్‌‌‌‌ అనే వ్యక్తితోనూ అనూషకు ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనూష ఇంటికి కరుణాకర్‌‌‌‌‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌ వచ్చి వెళ్తుండే వాళ్లు. అయితే ఈ మధ్య కల్యాణ్, అనూష, కరుణాకర్‌‌‌‌ మధ్య కొన్ని సార్లు గొడవ జరిగినట్లు తెలిసింది. మరోవైపు అనూషతో రాజశేఖర్‌‌‌‌ చనువుగా ఉండడం కరుణాకర్‌‌‌‌‌‌‌‌ గమనించాడు. కొంత కాలంగా అనూష తనను దూరం పెడుతోందని భావించాడు. ఇద్దరిపై అనుమానంతో అనూష ఇంటికి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడెప్పుడు వస్తున్నాడో తెలుసుకున్నాడు. కరుణాకర్‌‌‌‌, అనూష, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ల మధ్య కూడా గొడవలు జరిగినట్లు తెలిసింది.

బాత్ రూంలో దాచి..

బుధవారం డ్యూటీకి వెళ్లిన కల్యాణ్ రాత్రి ఇంటికి వెళ్లలేదు. అనూష కాల్‌‌‌‌ చేయడంతో రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ ఆమె ఇంటికి వెళ్లాడు. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ వచ్చిన విషయం తెలుసుకున్న కరుణాకర్‌‌‌‌‌‌‌‌.. గురువారం మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో అనూష ఇంటికి వచ్చాడు. కోపంతో వచ్చిన కరుణాకర్‌‌‌‌‌‌‌‌ను చూసి భయపడిన అనూష.. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ను బాత్​రూంలో దాచి, తాను ఇంకో రూంలో తల దాచుకుంది. ఆవేశంతో ఊగిపోయిన కరుణాకర్.. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌, అనూషను బయటికి రావాలని పిలిచాడు. బయటికి రాకపోతే ఆధ్యను చంపేస్తానని బెదిరించాడు. వాళ్లు బయటికి రాకపోవడంతో చిన్నారిపై సర్జికల్‌‌‌‌ బ్లేడ్‌‌‌‌తో గొంతు కోశాడు. దీంతో బాత్‌‌‌‌రూం నుంచి బయటికి వచ్చిన రాజశేఖర్‌‌‌‌‌‌‌‌పైనా దాడి చేశాడు. కరుణాకర్‌‌‌‌‌‌‌‌ దాడి నుంచి తప్పించుకుని రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ పారిపోయాడు. తర్వాత కరుణాకర్‌‌‌‌‌‌‌‌ తన మెడ, చెయ్యి కట్‌‌‌‌ చేసుకున్నాడు. కల్యాణ్ ఇంట్లో అరుపులు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని కుషాయిగూడలోని హస్పిటల్‌‌‌‌కి తరలించారు. కానీ పాప అప్పటికే చనిపోయింది.

ఖైరతాబాద్ దర్శనం ఆన్ లైన్లోనే