
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. ఆదర్శనగర్ కు చెందిన హితిక్ష (05) అనే బాలికను దారుణం హత్యచేశారు దుండగులు. చిన్నారి జులై 4న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. తీరా చూస్తే జులై 5న దగ్గర్లోని ఓ ఇంట్లో బాత్రూంలో రక్తపు మడుగులో చిన్నారి శవమై కనిపించింది . మెడను దారుణంగా కోసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
ALSO READ | విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మృతి
తల్లిదండ్రుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన సైకో విజయ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు. సైకో చంపేశాడా? లేక ఎవరైనా చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది. చిన్నారిని దారుణంగా హత్య చేయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.